Bujji thalli lyrics -Thandel | Javed ali Lyrics - Javed ali
| Singer | Javed ali |
| Composer | Devi Sri Prasad |
| Music | Devi Sri Prasad |
| Song Writer | Chandu mondeti |
Lyrics
గాలిలో ఊగిసలాడే దీపంలా
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక నాలోకం
సుడిగాలిలో పడి పడి లేచే
పడవల్లే తడబడుతున్నా..
నీ కోసం వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లి ..
చరణం-1
నీరు లేని చేపల్లే
తారలేని నింగల్లే
జీవమేది నాలోన నువ్వు మాటలాడందే
మళ్ళీ యాళకొస్తానే
కాళ్ళ యేళ్ళ పడతానే
లెంపలేసుకుంటానే
ఇంక నిన్ను యిడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగా దాటే గట్టోణ్ణే
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే
నా ప్రాణం ఓ బుజ్జితల్లి
నా కోసం ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లి
చరణం-2
ఇన్నినాళ్ళ మన దూరం
తియ్యనైన ఓ విరహం
చేదులాగ మారిందే అందిరాక నీ గారం
దేన్ని కానుకియ్యాలే
యెట్లా బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే
గాలివాన జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ
అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీ కోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి.
Comments
Post a Comment